సర్దార్ పటేల్‌కు భారతరత్న ఇవ్వడానికి 41 ఏళ్లు పట్టింది: కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
ఢిల్లీ, 30 అక్టోబర్ (హి.స.)భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వారసత్వాన్ని గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శించారు. పటేల్ మరణించిన 41 సంవత్సరాల తర్వాత ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్
అమిత్ షా


ఢిల్లీ, 30 అక్టోబర్ (హి.స.)భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వారసత్వాన్ని గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శించారు. పటేల్ మరణించిన 41 సంవత్సరాల తర్వాత ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

సర్దార్ పటేల్ మరణానంతరం ఆయన వారసత్వాన్ని చెరిపివేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. ఆయనకు భారతరత్న ఇవ్వడానికి 41 ఏళ్ల సమయం పట్టింది. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతిపెద్దదైన 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' నిర్మించి పటేల్‌కు అసలైన గౌరవాన్ని అందించారు అని అమిత్ షా అన్నారు.

సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల గురించి తెలియజేయడానికే తాను ఇక్కడికి వచ్చానని షా తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని ఏకీకృతం చేయడంలో, ఏక్ భారత్ నిర్మాణంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారు. రేపు ఆయన 150వ జయంతి. 2014 నుంచి ప్రధాని మోదీ ప్రతి ఏటా కేవడియాకు వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు అని పేర్కొన్నారు.

ఈ ఏడాది నుంచి పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31న ప్రతి సంవత్సరం భారీ పరేడ్ నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు అమిత్ షా ప్రకటించారు. ఈ సంవత్సరం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లాలు, పోలీస్ స్టేషన్ల స్థాయిలో 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తాం అని వివరించారు. దీంతో పాటు నవంబర్ 1 నుంచి 15 వరకు ఏక్తా నగర్‌లో 'ఏక్ భారత్ పర్వ్' కార్యక్రమం ఉంటుందని, గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతినాడు అది ముగుస్తుందని తెలిపారు.

సర్దార్ పటేల్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సిద్ధాంతం. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మహాత్మాగాంధీ నేతృత్వంలోని ఎన్నో ఉద్యమాలకు వెన్నెముకగా నిలిచారు. అందుకే గాంధీజీ ఆయనకు ప్రేమతో 'సర్దార్' అనే బిరుదు ఇచ్చారు అని అమిత్ షా అన్నారు.

దేశ సమగ్రత విషయంలో పటేల్ తీసుకున్న నిర్ణయాత్మక పాత్రను గుర్తుచేస్తూ, ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్ర్య వేడుకల్లో ఉన్నప్పుడు, సర్దార్ పటేల్ కమాండ్ రూమ్‌లో ఉండి లక్షద్వీప్‌ను కాపాడేందుకు నావికాదళ అధికారులతో ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయన నాయకత్వ పటిమ వల్లే ఆ దీవులు భారత్‌లో అంతర్భాగమయ్యాయి అని అమిత్ షా వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande