
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,31 అక్టోబర్ (హి.స.)
: బిఎస్ఎన్ఎల్ఎల్ (BSNL) ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టిన చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు టెలికాం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి ప్రముఖ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల కస్టమర్లను ఆశ్చర్యపరిచే విధంగా బిఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ధరల్లోనే దీర్ఘకాల వ్యాలిడిటీతో కూడిన ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ వంటి ముఖ్యమైన సేవలను సౌకర్యవంతంగా ఉపయోగించుకునే వీలును కల్పిస్తూ.. ఆరు నెలల నుంచి ఏడాది వరకు గల ప్లాన్‌లను అతి తక్కువ ధరల్లో లాంచ్ చేసింది. ముఖ్యంగా 6 నెలల ప్లాన్ నెలకు కేవలం రూ.150 ఖర్చుతో లభించడం వినియోగదారులను ఆకర్షిస్తోంది.
897 ప్రీపెయిడ్ ప్లాన్:
బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న 897 ప్రీపెయిడ్ ప్లాన్ 180 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజువారీ డేటా పరిమితి లేకుండా మొత్తం 90 GB డేటా లభిస్తుంది. అంటే వినియోగదారుడు తన అవసరానికి అనుగుణంగా ఎప్పుడైనా డేటాను ఉపయోగించుకోవచ్చు. 90 GB పూర్తయిన తర్వాత 40 Kbps వేగంతో పోస్ట్-డేటా లభిస్తుంది. దీనితోపాటు అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. మొత్తంగా తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా దీర్ఘకాలిక ఉపయోగం కోరుకునే వారికి ఇది అత్యుత్తమ ఎంపిక.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు