
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:17pt;}.pf0{}
ఢిల్లీ,31 అక్టోబర్ (హి.స.)
బిహార్ ప్రజలు విసిగిపోయారనీ, వారు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే బిహార్‌ను వలసలు లేని రాష్ట్రంగా మారుస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ గురువారం పట్నాలో ‘ఈటీవీ భారత్’తో ఆయన మాట్లాడారు. విద్య, ఉపాధి, వైద్యం ఇలా ఏ కారణంతోనైనా ఇతర రాష్ట్రాలకు బిహార్ ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూస్తామని చెప్పారు. ఐదేళ్లలో స్థానిక యువతకు అవకాశాలు కల్పించి, బిహార్‌ను ఆత్మనిర్భరత కలిగిన రాష్ట్రంగా చేయడమే తన లక్ష్యమని వివరించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు