బీహార్‌ ఎన్డీయే మేనిఫెస్టో రిలీజ్‌
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Garamond;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;fon
బీహార్‌ ఎన్డీయే మేనిఫెస్టో రిలీజ్‌


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Garamond;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf4{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}

.పాట్నా: /ఢిల్లీ,31 అక్టోబర్ (హి.స.)బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఎన్డీయే కూటమి మేనిఫెస్టో(Bihar Election Manifesto) విడుదల చేసింది. కోటి ఉద్యోగాల హామీతో పాటు కోటి మంది మహిళలను లక్షాధికారులుగా చేయడమే తమ లక్ష్యంగా అందులో ప్రకటించుకుంది. శుక్రవారం పాట్నాలోని మౌర్య హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొని ఎన్డీయే జాయింట్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం నితీశ్‌కుమార్‌తో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సరిగ్గా వారం ఉంది(నవంబర్‌ 6న). ఈలోపు.. నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (NDA) వికసిత్‌ బీహార్‌ కోసం సంకల్ప పత్ర పేరిట ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వలస కార్మికుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రంలో కోటి ఉద్యోగాల హామీ కీలక ప్రకటనగా మారే అవకాశం కల్పిస్తోంది. అలాగే.. మహిళా సాధికారత పేరిట లక్షపతి దీదీల హామీపైనా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు.. అధికారంలోకి మళ్లీ వస్తే, నైపుణ్య గణాంక సర్వే (Skill Census) నిర్వహిస్తామని హామీ చేర్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande