
ముంబై, 31 అక్టోబర్ (హి.స.) చాలా మంది ప్రతి రోజు బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తుంటారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. వచ్చే నెల అంటే నవంబర్‌లో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఇందులో జాతీయ, ప్రాంతీయ సెలవులు ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి సెలవులు ఉంటాయని గుర్తించుకోండి. మీరు ప్రతి రోజు బ్యాంకు పనులకు వెళ్తున్నట్లయితే ముందస్తుగా ఈ బ్యాంకు సెలవులను గమనించి ముందస్తు ప్లాన్ చేసుకోవడం మంచిది. మరి నవంబర్‌లో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం..
నవంబర్ 1 (శనివారం): కర్ణాటక రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటకలో, ఇగాస్-బగ్వాల్ సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని బ్యాంకులకు సెలవు.
నవంబర్ 2 (ఆదివారం): సాధారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
నవంబర్ 5 (బుధవారం): గురునానక్ జయంతి, కార్తిక పూర్ణిమ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులు బంద్.
నవంబర్ 7 (శుక్రవారం): వంగల పండుగ సందర్భంగా మేఘాలయలో, షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవులు.
నవంబర్ 8 (శనివారం): కనకదాస జయంతి, రెండో శనివారం సందర్భంగా కర్ణాటక సహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్ 9 (ఆదివారం): దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్ 11 (మంగళవారం): లహాబ్ డ్యూచెన్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులు మూసి ఉంటాయి.
నవంబర్ 16 (ఆదివారం): దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్ 22 (శనివారం): నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్ 23 (ఆదివారం): దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
నవంబర్ 25 (మంగళవారం): గురు తేగ్ బహదూర్ జీ అమర వీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో బ్యాంకులు బంద్.
నవంబర్ 30 (ఆదివారం): దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఈ సర్వీసులు అందుబాటులో..
ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV