
ముంబై, 31 అక్టోబర్ (హి.స.)గత ఐదారు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఈ రోజు ఉదయం నిలకడగా ఉన్న పసిడి ధరలు.. 9 గంటల సమయానికి తులం బంగారం ధరపై ఏకంగా రూ.1200 వరకు ఎగబాకింది. అలాగే వెండి ధరల్లో ఏ మాత్రం మార్పులేదు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,680 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,450 వద్ద కొనసాగుతోంది. అయితే దేశీయంగా కిలో వెండి ధర రూ.1,51,000 ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,22,680 ఉండగా, కిలో వెండి ధర రూ.1,65,000 ఉంది.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ బాగా తగ్గింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక ప్రకారం, మొత్తం బంగారం డిమాండ్ 16 శాతం తగ్గి 209.4 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 248.3 టన్నులు. అధిక బంగారం ధరల కారణంగా వినియోగదారుల కొనుగోళ్లు తగ్గడం వల్ల ఈ తగ్గుదల ప్రధానంగా జరిగింది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV