
ముంబై, 29 అక్టోబర్ (హి.స.)బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. తగ్గినట్లే తగ్గి భారీ దెబ్బ కొడుతుంటుంది. గత నాలుగైదు రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నబంగారం, వెండి ధరలు.. ఉన్నట్టుండి బుధవారం భారీగా పెరిగింది. అక్టోబర్29వ తేదీన తులం బంగారంపై మళ్లీ ఏకంగా రూ.760 ఏగబాకింది. అదే వెండి ధరపై వెయ్యి రూపాయలు పెరిగింది.
అయితే గుడ్ రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం..24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.760 పెరుగగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.700 వరకు ఎగబాకింది. దేశీయంగా ధరలను పరిశీలిస్తే ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,21,580 వద్ద చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,450 వద్ద ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 1 లక్షా 52,000 వద్ద కొనసాగుతోంది. గత నాలుగైదు రోజు నుంచి పడిపోతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పైకి లేచాయి.
వెండి గురించి చెప్పాలంటే, ఢిల్లీలో వరుసగా రెండు రోజుల్లో కిలోకు రూ.4100 తగ్గింది. మూడు రోజుల స్థిరత్వానికి ముందు వరుసగా నాలుగు రోజుల్లో కిలోకు రూ.17 వేలు తగ్గింది. నేడు వెయ్యి రూపాయలు పెరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV