మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం.. ఇక ఆ నాలుగు బ్యాంకులు కనుమరుగు!
ఢిల్లీ, 26 అక్టోబర్ (హి.స.)ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను కుదించి గ్లోబల్ స్థాయిలో బలమైన బ్యాంకులుగా సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం 12 పబ్లిక్ నేషనల్ బ్యాంకులలో నాలుగింటిని విలీనం
once-again-the-merger-of-public-sector-banks-and-those-four-banks-will-disappear-


ఢిల్లీ, 26 అక్టోబర్ (హి.స.)ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను కుదించి గ్లోబల్ స్థాయిలో బలమైన బ్యాంకులుగా సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం 12 పబ్లిక్ నేషనల్ బ్యాంకులలో నాలుగింటిని విలీనం చేసి మొత్తం వాటిని సంఖ్యను ఎనిమిదికి పరిమితం చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇండియన్‌ ఓవర్సిస్ బ్యాంక్‌ (IOB), సెంట్రల్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (BOM)లను పెద్ద బ్యాంకులైన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ (PNB), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB) వంటి వాటిల్లో వీటిని విలీనం చేయబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా, విలీన ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయా బ్యాంకర్లు తెలిపారు. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ అంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కేబినెట్ భేటీలో చర్చలు జరిపి, ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదం పొందిన తర్వాతే బ్యాంకుల విలీన ప్రక్రియ ఉండనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande