
ముంబై, 28 అక్టోబర్ (హి.స.)బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. గతంలో తులం బంగారం కొనాలంటేనే రూ. 1.33 లక్షల వరకు ఉండేది. అదే వెండి రూ.2 లక్షలకు చేరువులో ఉండేది. కానీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం దేశీయంగా నిన్నటితో పోల్చుకుంటే మంగళవారం తులం బంగారం ధరపై ఏకంగా 2 వేల రూపాయలకునే తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,990 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,420 ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,140 ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,270 ఉండగదా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,990 ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV