
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ,31 అక్టోబర్ (హి.స.):.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఇరాన్‌లోని చాబహార్ పోర్టు విషయంలో భారత్‌కు భారీ ఊరట లభించింది. చాబహార్ పోర్టు ప్రాజెక్టుపై అమెరికా ఆంక్షల నుంచి భారత్‌కు మరో ఆరునెలలు మినహాయింపు లభించిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అమెరికా గతంలో ఇచ్చిన మినహాయింపునకు తాజాగా గడువు ముగిసిన నేపథ్యంలో మళ్లీ ఈ పొడిగింపు వచ్చింది. చాబహార్ నౌకాశ్రయాన్ని 10 ఏళ్ల పాటు నిర్వహించేందుకు 2024 మే 13న ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, ఇరాన్‌కు చెందిన పోర్ట్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నౌకాశ్రయంలో భారత్ 370 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.
అఫ్గాన్ సార్వభౌమత్వానికి కట్టుబడి ఉన్నాం
అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఘర్షణలపై స్పందిస్తూ...అఫ్గాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్య్రానికి భారత్ కట్టుబడి ఉందని జయస్‌వాల్ వెల్లడించారు. ‘‘అఫ్గానిస్థాన్ తన సొంత భూభాగాన్ని పాలించడంపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని యథేచ్ఛగా కొనసాగించే హక్కు ఉందని పాక్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చర్యలను పొరుగు దేశాలు ఆమోదించవు. అఫ్గాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్య్రానికి భారత్ కట్టుబడి ఉంది’’ అని రణ్‌ధీర్ జయస్‌వాల్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు