
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
:రాయ్‌పూర్:/ఢిల్లీ,31 అక్టోబర్ (హి.స.) ఛత్తీస్‌గడ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మరోమారు తుపాకీ గర్జించింది. 288 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండే ఈ గుట్టలు తెలంగాణ ప్రాంతంలో 90 కిలోమీటర్ల పొడవునా ఉన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడ భద్రత బలగాలు తొలుత ‘బచావో కర్రెగుట్టలు’.. ఆ తర్వాత ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ పేరుతో నక్సల్స్ ఏరివేతకు 24 వేల మంది పోలీసులను మోహరించాయి. డ్రోన్లతో గుట్టలను జల్లెడ పట్టాయి. అయితే.. ఆరుగురు పీఎల్‌జీ సభ్యుల(వీరిలో ముగ్గురు మహిళలు) ఎన్‌కౌంటర్ మినహా.. పెద్దగా పురోగతిని సాధించలేకపోయాయి.
ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి..
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని కేంద్ర బలగాలు దేశ సరిహద్దులకు వెళ్లాయి. దీంతో.. ఉన్నఫళంగా ఆపరేషన్ కర్రెగుట్టలకు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ బలగాలు సైతం అబూజ్‌మఢ్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేశాయి. కర్రెగుట్టల్లో 30కి పైగా భారీ కొండలు ఉండగా.. అప్పట్లో భద్రతాబలగాలు నీలం కొండ(సరాయ్), దోబే కొండలు, ఆలుబాకల్లో మూడు బేస్ క్యాంపులను ఏర్పాటు చేశాయి. వెయ్యి మంది మావోయిస్టులు తలదాచుకున్న ఓ కలుగును గుర్తించాయి. అంతకు మించితే.. పెద్దగా పురోగతి సాధించింది లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు