
ఢిల్లీ, 31 అక్టోబర్ (హి.స.)సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. భారత స్వాతంత్ర్యం అనంతరం 562 దేశీయ రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను “భారత ఐక్యత శిల్పి”గా, “ఉక్కు మనిషి”గా గౌరవిస్తారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీతో పాటు అహింసా మార్గంలో నడిచిన సర్దార్ పటేల్, దేశ నిర్మాణానికి పునాది వేసిన మహా నాయకుల్లో ఒకరు. దీంతో ఆయన జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా.. “రాష్ట్రీయ ఏకతా దివస్”గా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన వీడియోతో పాటు సందేశాన్ని పోస్టు చేశారు.
అందులో పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశం ఉక్కు మనిషికి నివాళులు అర్పిస్తోంది. భారత దేశ సమైక్యతకు చోదక శక్తిగా పటేల్ నిలిచారు. తద్వారా మన దేశ నిర్మాణాత్మక సంవత్సరాల్లో దాని విధిని రూపొందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV