
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,31 అక్టోబర్ (హి.స.)దేశ వ్యాప్తంగా నెలకొన్న కుక్కల బెడదపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఇటీవల కుక్కల సమస్యపై సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయంగా భారతదేశ గౌరవం డ్యామేజ్ అవుతున్నా మేలుకోరా? అంటూ వ్యాఖ్యానించింది. తాజాగా ఇదే అంశంపై న్యాయస్థానం.. చీఫ్ సెక్రటరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ సెక్రటరీలు సోమవారం ధర్మాసనం ముందు ఫిజికల్‌గా హాజరు కావాల్సిందేనని సూచించింది. ఒకవేళ వ్యక్తిగతంగా హాజరుకాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం వార్నింగ్ ఇచ్చింది.
వీధి కుక్కల కేసు విచారణకు తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ మినహా ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు ఎందుకు హాజరుకావడం లేదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు ఫిజికల్‌గా హాజరు కావాల్సిందేనంటూ నోటీసులు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు