శబరిమలలో దొంగిలించిన బంగారాన్ని అమ్మేశారు!
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} చెన్నై 31 అక్టోబర్ (హి.స.)పథనంతిట్ట: శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్త
Sabarimala


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

చెన్నై 31 అక్టోబర్ (హి.స.)పథనంతిట్ట: శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కీలక ఆధారాలను సేకరించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి.. 476 గ్రాముల బంగారాన్ని అమ్మేసినట్లు దర్యాప్తులో వెల్లడించాడు. ఆ బంగారాన్ని 2019లోనే కర్ణాటకలో గోవర్ధన్ అనే వ్యాపారికి విక్రయించినట్లు వాంగ్మూలమిచ్చినట్లు సిట్ అధికారులు తెలిపారు.

2019లో బంగారు తాపడాలకు మెరుగులు దిద్దే పనిలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే..! దీంతో కేరళ సర్కారుపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పినరయి విజయన్ సర్కారు ఈ అంశంపై దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ ప్రాథమిక దర్యాప్తులో ఉన్నికృష్ణన్‌ను ప్రధాన నిందితుడిగా తేల్చి, అరెస్టు చేసింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న ఉన్నికృష్ణన్‌ను సిట్ అధికారులు కోర్టు అనుమతితో ఈ నెల 30వ తేదీ వరకు కస్టడీకి తీసుకుని, విచారించారు. ఈ క్రమంలో తొలుత 2 కిలోల బంగారం చోరీ అయినట్లు అనుమానాలు వ్యక్తమైనా.. తాజాగా ఉన్నికృష్ణన్ ఇచ్చిన వాంగ్మూలంలో దొంగతనానికి గురైన బంగారం బరువును 476 గ్రాములుగా తేల్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande