అనంతపురం, 5 అక్టోబర్ (హి.స.)
ఒక క్రీడలో జాతీయ స్థాయికి రావాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది రెండు క్రీడాంశాల్లో ఇద్దరు అన్నదమ్ములు జాతీయ స్థాయిని అందుకోవడం స్ఫూర్తిదాయక అంశమే. లాన్ టెన్నిస్‌లో రంగప్రవేశం చేసిన ఇద్దరూ..సాఫ్ట్ టెన్నిస్‌లో కూడా జాతీయస్థాయిని అందుకున్నారు. అటు పాఠశాల క్రీడల్లో ఇటు క్రీడాసంఘాలు నిర్వహించే పోటీల్లో అద్భుతంగా రాణిస్తూ జిల్లాకు వన్నె తెస్తున్నారు. అనంతపురం నగరానికి చెందిన వి.అపర్ణ, సూర్యనారాయణరెడ్డి దంపతుల కుమారులు విజ్ఞానందరెడ్డి, ధ్యానేశ్వరరెడ్డి. ఇద్దరూ ఆర్డీటీలో క్రీడా ఓనమాలు నేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ