విశాఖపట్నం, 6 అక్టోబర్ (హి.స.) జగన్ హయాంలో కల్తీ మద్యంతో ఎంతోమంది ప్రాణాలను తీశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ (YSRCP) హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంతో పలువురు ప్రాణాలు కోల్ఫోయారని గుర్తుచేశారు. ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)కి లేదని ధ్వజమెత్తారు. గత జగన్ ప్రభుత్వంలో ఇద్దరు గిరిజనులు డిప్యూటీ సీఎంలు అయ్యారని... కానీ కనీసం ఒక్కసారైనా ఆశ్రమ పాఠశాలలను సందర్శించారా..? అని ప్రశ్నించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు హోంమంత్రి అనిత.
ఇవాళ (సోమవారం) కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మన్యం జిల్లా గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులను అనిత పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు. వైద్యుల నిపుణులతో ఒక కమిటీ వేశామని.. సమగ్రమైన విచారణ జరుగుతోందని చెప్పుకొచ్చారు. పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి సంధ్యారాణి నిన్న(ఆదివారం) పరామర్శించారని తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV