ఇంద్రకీలాద్రి పై రికార్డుస్థాయిలో భక్తులు దసరా తర్వాత. మూడు రోజుల్లో
అమరావతి, 6 అక్టోబర్ (హి.స.) ఇంద్రకీలాద్రికి రికార్డు స్థాయిలో భక్తులు ఈసారి దసరా, తర్వాత మూడు రోజుల్లో వచ్చారు. గత ఏడాది దసరా, తర్వాత వచ్చిన భవానీలు కలిపి 12 లక్షలు కాగా ఈసారి ఏకంగా 20 లక్షల మంది వరకూ దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. అధికారులు అంచనా
ఇంద్రకీలాద్రి పై రికార్డుస్థాయిలో భక్తులు దసరా తర్వాత. మూడు రోజుల్లో


అమరావతి, 6 అక్టోబర్ (హి.స.) ఇంద్రకీలాద్రికి రికార్డు స్థాయిలో భక్తులు ఈసారి దసరా, తర్వాత మూడు రోజుల్లో వచ్చారు. గత ఏడాది దసరా, తర్వాత వచ్చిన భవానీలు కలిపి 12 లక్షలు కాగా ఈసారి ఏకంగా 20 లక్షల మంది వరకూ దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. అధికారులు అంచనా వేసినట్టే.. భారీగా పోటెత్తారు. విజయదశమి నాటికి 11 రోజుల్లో మొత్తం 15.90 లక్షల మంది ఆలయానికి వచ్చారు. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల్లో 4.15 లక్షల మంది వచ్చారు. శుక్ర, శని, ఆదివారాల్లో.. 1.47 లక్షలు, 1.38 లక్షలు, 1.30 లక్షల మంది భవానీ భక్తులు పోటెత్తారు. దసరా ఉత్సవాల చరిత్రలోనే ఎన్నడూ ఇంత భారీగా భక్తులు రాలేదు. ఈసారి భక్తుల తాకిడితో ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 12 వరకూ దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ్య లడ్డూ ప్రసాద అమ్మకాలు కూడా ఈసారి భారీగా జరిగాయి. గత ఏడాది 28.09 లక్షల లడ్డూ ప్రసాదాలు అమ్మితే... ఈసారి ఆదివారం వరకు 43 లక్షల లడ్డూలు విక్రయించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande