నాయకి మద్యం కేసులో ఇద్దరు టీడీపీ నేతల.పై వేటు
రాయచోటి, 6 అక్టోబర్ (హి.స.) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం వ్యవహారంపై టీడీపీ అధిష్ఠానం సీరియస్‌ అయింది. ఈ విషయంలో టీడీపీ నాయకుల ప్రమేయంపై వివరాలు తెప్పించుకున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు... ఆరోపణలు
నాయకి మద్యం కేసులో ఇద్దరు టీడీపీ నేతల.పై వేటు


రాయచోటి, 6 అక్టోబర్ (హి.స.)

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం వ్యవహారంపై టీడీపీ అధిష్ఠానం సీరియస్‌ అయింది. ఈ విషయంలో టీడీపీ నాయకుల ప్రమేయంపై వివరాలు తెప్పించుకున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు... ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ మేరకు తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లె జయచంద్రా రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ పల్లా ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. ఈ ఇద్దరి ప్రమేయంపై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande