తిరుమల, 6 అక్టోబర్ (హి.స.)అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు.
ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 5 నుంచి 6 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో కిక్కిరిపోయి..
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV