జాతీయ విపత్తుల నిర్వహణ సేవల్లో NDRF అగ్రస్థానం.. కేంద్ర మంత్రి బండి సంజయ్
న్యూఢిల్లీ, 8 అక్టోబర్ (హి.స.) జాతీయ విపత్తుల నిర్వహణ సేవల్లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(NDRF) అగ్రస్థానంలో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందిస్తున్న సేవలతోపాటు జాతీయ విపత
బండి సంజయ్


న్యూఢిల్లీ, 8 అక్టోబర్ (హి.స.)

జాతీయ విపత్తుల నిర్వహణ సేవల్లో

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(NDRF) అగ్రస్థానంలో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందిస్తున్న సేవలతోపాటు జాతీయ విపత్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు విస్త్రతంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సంస్థ అధికారులను కోరారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 'సచేత్ (sachet) యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకునేలా చైతన్యం కలిగించాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బందికి క్లిష్టమైన సమయాల్లో రోప్స్, గ్యాస్ కట్టర్స్, జాకెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని కోరారు.

ఈరోజు న్యూఢిల్లీలోని ఎన్డీఎంఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ) సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్డీఎంఏ ఉన్నతాధికారులతో సమావేశమై సంస్థ అందిస్తున్న సేవలను, చేపడుతున్న కార్యాచరణను అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఎంఏ సేవలకు సంబంధించి కేంద్ర మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande