తెలంగాణ, జగిత్యాల. 8 అక్టోబర్ (హి.స.)
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ ఉన్న ఈవీఎం గోదాంలో మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి సత్యప్రసాద్ తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరులను పరిశీలించిన కలెక్టర్, అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెల ఈ ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోదాంలోని యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు సాంకేతిక పరమైన అంశాలను పరిశీలిస్తామని గోదాం వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని నిత్యం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత, జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్, కలెక్టర్ ఏవో హకీమ్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు