హైదరాబాద్, 8 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఎన్నికకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో పార్టీలు అభ్యర్థుల కోసం కసరత్తులో స్పీడ్ పెంచాయి. ఈ క్రమంలో ఇక్కడ అభ్యర్థి ఎంపిక కోసం నాయకులు, పార్టీ కేడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ ఇవాళ తన నివేదికను రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు అందజేసింది. మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు సభ్యులుగా బీజేపీ ఈ కమిటీని నియమించింది.పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించిన ఈ కమిటీ తాజాగా తన నివేదికను సీల్డ్ కవల్ో స్టేట్ చీఫ్కు అందజేసింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు