వరద నష్టం పై కామారెడ్డి జిల్లాలో సెంట్రల్ టీం పర్యటన..
తెలంగాణ, కామారెడ్డి. 8 అక్టోబర్ (హి.స.) భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సెంట్రల్ టీం బుధవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో పర్యటించి వివరాలు సేకరించింది. ముందుగా మండల కేంద్రంలోని దాసనమ్మ కుంట వద్ద పూర్తిగా దెబ్బతిన్న కొత్త
సెంట్రల్ టీం


తెలంగాణ, కామారెడ్డి. 8 అక్టోబర్ (హి.స.)

భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సెంట్రల్ టీం బుధవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో పర్యటించి వివరాలు సేకరించింది. ముందుగా మండల కేంద్రంలోని దాసనమ్మ కుంట వద్ద పూర్తిగా దెబ్బతిన్న కొత్త దళిత వాడకు వెళ్లే రోడ్డును పరిశీలించి, స్థానిక అధికారులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకుంది. అక్కడి నుంచి అంతంపల్లి గ్రామ శివారులో ఎడ్ల కట్ట వాగు ప్రవహించే బ్రిడ్జి వద్ద ఆగి దెబ్బతిన్న పంటలను, పొలాల్లో పేరుకుపోయిన ఇసుక దిబ్బలను పరిశీలించింది. అక్కడ వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని ఫొటోలతో ఉన్న మ్యాప్ ద్వారా బృందానికి వివరాలు వెల్లడించారు. బృందం వెంట జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో పాటు జిల్లా అధికార యంత్రాంగం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande