తెలంగాణ, మెదక్. 8 అక్టోబర్ (హి.స.)
ఇటీవల కురిసిన భారీవర్షాలతో
వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం బృందం నేడు మెదక్ జిల్లాలో పర్యటిస్తుంది. బుధవారం కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ కే. పొన్ను స్వామి, వినోద్ కుమార్, అభిషేక్ కుమార్, ఎస్ఎస్ పింటు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. వారికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీఓ రమాదేవి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో భారీ వర్షాల వల్ల ఎక్కడెక్కడ నష్టం వాటిల్లింది చూసి పరిశీలిస్తారు. వారి వెంట మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ ఇతర అధికారులు ఉన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో మీడియాను కేంద్రం బృందం పర్యటనలో అనుమతించలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు