తెలంగాణ, వరంగల్. 8 అక్టోబర్ (హి.స.)
గంజాయి ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను కేయూ పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.20 లక్షల 50 వేల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నరసింహ రావు బుధవారం మాట్లాడుతూ.. రాను హుస్సైన్, నూర్ మహమ్మద్ మియాలను అరెస్టు చేశామని తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి 41 కిలోల గంజాయిని, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తెలిపారు. అరెస్టు చేసిన వారిద్దరిని రిమాండ్కు తరలించామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల పై ప్రత్యేక నిఘా పెడతామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు