బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కాలర్షిప్ విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా..
తెలంగాణ, హనుమకొండ. 8 అక్టోబర్ (హి.స.) బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు నేడు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు వారి 2022-23, 2023-
బెస్ట్ అవైలబుల్ స్కీం


తెలంగాణ, హనుమకొండ. 8 అక్టోబర్ (హి.స.)

బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు నేడు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు వారి 2022-23, 2023-24, 2024-25, విద్యా సంవత్సరం వరకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ చదువుతున్న విద్యార్థుల నిర్వహణకు సంబంధించి స్కాలర్షిప్ మంజూరు చేయని కారణంగా తమ విద్యార్థులను విద్యాసంస్థల యాజమాన్యాలు అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలను నిలదీయగా.. వారు తమకు ప్రభుత్వాల నుండి గత మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వాలు ఎలాంటి స్కాలర్షిప్ మంజూరు చేయకున్నా విద్యార్థినీ విద్యార్థుల విద్యకు ఆటంకం రాకుండా తమ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నట్లు తెలిపారని, ఇంకా నడిపిస్తే పూర్తిగా పీకల్లోకి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి తమ విద్యాసంస్థల్లోనే కాకుండా తమ కుటుంబాల జీవనమే కొనసాగించడం కష్టమవుతుందని విద్యా సంస్థల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేసినట్లు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ చదువులు కొనసాగుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. మా బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వారి వారి చదువులు నిరాటంకంగా కొనసాగించడానికి ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే పూనుకొని మిగిలి ఉన్న సుమారుగా తొమ్మిది కోట్ల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేసి తమ పిల్లలకు విద్య ఆటంకం లేకుండా కొనసాగించడానికి సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande