హైదరాబాద్, 8 అక్టోబర్ (హి.స.)
బీసీ రిజర్వేషన్ల విచారణను రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ల తరపు వాదనల అనంతరం.. ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రేపు మరికొన్ని వాదనలు వినిపిస్తామని వారు పేర్కొన్నారు. నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా హైకోర్టు నిరాకరించింది.
అయితే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై విచారణ సందర్భంగా బీసీ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లు హైకోర్టు ప్రాంగణంలోనే ఉండి స్వయంగా వాదనలు విన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..