హైదరాబాద్, 8 అక్టోబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేయాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. బుధవారం నర్సంపేట మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎన్నికల సామాగ్రి, రిటర్నింగ్, సహాయ అధికారి స్వీకరణ గదులను, జనరల్ అబ్జర్వర్, వ్యయ పరిశీలకుల గదులు, ఎన్నికల సిబ్బంది, తదితర అంశాలను సైతం పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా సజావుగా జరగాలని, నామినేషన్ల స్వీకరణకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, పాటించాల్సిన విధానాల గురించి తీశారు. ఏలాంటి పొరపాట్లు, ఆలస్యం లేకుండా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పక్కగా జరగాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..