జూబ్లీ.హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి .అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిని. ప్రకటించింది
అమరావతి, 9 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ తరఫునుంచి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. ఇక, భారత రాష్ట్ర సమితి తరఫున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీలో ఉన్నారు. భ
జూబ్లీ.హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి .అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిని. ప్రకటించింది


అమరావతి, 9 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ తరఫునుంచి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. ఇక, భారత రాష్ట్ర సమితి తరఫున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేసులో బీజేపీ తరఫునుంచి పోటీ చేసేవారిలో జూటురు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, లంకల దీపక్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఆ కారణంతో మళ్లీ ఆయనకే సీటు ఇచ్చే అవకాశం ఉందని టాక్.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande