అమరావతి, 9 అక్టోబర్ (హి.స.)
యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామన్నపేటలోని సుభాష్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు జరుగుతుండగా కంటైనర్ లారీ అదుపు తప్పి భయంకరమైన ఘటనకు దారితీసింది. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో వాహనాలను తనిఖీ చేస్తున్న హోంగార్డు ఉపేందర్‌ను కంటైనర్ ఢీకొట్టి పైనుండి వెళ్లిపోయింది ఉపేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ