నెల్లూరు, 9 అక్టోబర్ (హి.స.) ఈ నెల 10న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున, వారి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు.
వెంకటాచలం మండలం ఈదగాలిలో విస్వసముద్ర బయో ఇధనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రానున్న దృష్ట్యా, ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లా ఎస్పీ అనితా వేజెండ్లతో కలసి ఈ రోజు ఉదయం పరిశీలించారు.
ఈ సందర్బంగా గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని, అక్కడి నుండి నందగోకులం లైఫ్ స్కూల్, గోశాల, విస్వసముద్ర బయో ఇధనాల్ ప్లాంట్ ప్రాంతాలను పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయవలసిందిగా పోలీస్ అధికారులకు సూచించారు. ఎవరికి కేటాయించిన విధులను వారు సక్రమంగా, భాధ్యత తో నిర్వహించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV