
కర్నూలు, 13 నవంబర్ (హి.స.)కాఫీ, టీలతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రస్తుతం ప్రచారంలో ఉంది. కానీ, ఉదయాన్నే కప్పు టీ, కాఫీ లేనిదే రోజు గడవని పరిస్థితి చాలా మందిలో ఉంది. అయితే, తగిన మోతాదులో ఈ టీ, కాఫీలు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మరికొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా కాఫీలో ఉండే, కెఫిన్ తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగుంటుంది. దీంతో మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. కెఫిన్ వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ చూద్దాం...
కెఫిన్ తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగుంటుంది. దీంతో మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడానికి కెఫిన్ సాయపడుతుంది. ఇది మనసును ఆనందంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. కెఫిన్‌తో పాటు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే వాటి పనితీరు మెరుగుపడుతుంది. పెయిన్ కిల్లర్స్ ప్రభావం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి, చాలా మంది కెఫిన్‌తో పాటు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు.
కెఫిన్ నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కెఫిన్ తీసుకుంటే అలసట తగ్గుతుంది. దీంతో ఉత్సాహంగా ఉండొచ్చు. కెఫిన్ మనసుకు శాంతిని కలిగిస్తుంది. కెఫిన్ ఉన్న ఆహారాలు, పానీయాలు తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కెఫిన్ ఉన్న పదార్థాలను తీసుకుంటే ఫోకస్ పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవుతాయి. క్రియేటివిటీ పెరుగుతుంది.
కెఫిన్ తీసుకుంటే శరీరానికి తక్షణ ఎనర్జీ వస్తుంది. వ్యాయామం చేసే సమయంలో కెఫిన్ తీసుకుంటే ఎక్కువ స్టామినాను పొందవచ్చు. కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే మెటాబాలిజం రేటు పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు. తగిన మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె పనితీరు బాగుంటుంది. గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV