
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 13 నవంబర్ (హి.స.)
ఢిల్లీ పేలుళ్ల తర్వాత సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులు పోస్ట్ చేసినందుకు అస్సాంలో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశారు. నిన్న రాత్రి అరెస్టు చేసిన ఆరుగురితో పాటు మొత్తం 15 మందిని అరెస్ట్ చేశాం. అందులో రఫీజుల్ అలీ (బొంగైగావ్), ఫరీదుద్దీన్ లస్కర్ (హైలకండి), ఇనాముల్ ఇస్లాం (లఖింపూర్), ఫిరోజ్ అహ్మద్ అలియాస్ పాపోన్ (లఖింపూర్), షాహిల్ షోమన్ సిక్దార్ అలియాస్ షాహిదుల్ ఇస్లాం (బార్పేట), రకీబుల్ సుల్తాన్ (బార్పేట), నసీమ్ అక్రమ్ (హోజై), తస్లిమ్ అహ్మద్ (కమ్రూప్), అబ్దుర్ రోహిమ్ మొల్లా అలియాస్ బప్పి హుస్సేన్ (దక్షిణ సల్మారా) ఉన్నారు. అస్సాం పోలీసులు హింసను కీర్తించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రాజీపడరు” అని హిమంత బిశ్వ శర్మ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
గురువారం ఉదయం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఓ పోస్ట్ చేశారు. హింసను కీర్తించే వారిపై అస్సాం పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, ఈ విషయంలో రాజీపడేదే లేదని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ