
ముంబై, 13 నవంబర్ (హి.స.)
బాలీవుడ్ నటుడు, ఎంపీ సన్నీ డియోల్ మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముంబైలోని ఇంటి ముందు వేచి చూస్తున్న మీడియా, ఫోటోగ్రాఫర్లపై అసహనాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్రకు ఇంటి వైద్యం అందిస్తున్నారు. అయితే కవరేజీకి వెళ్లిన మీడియా.. సన్నీ డియోల్ ఇంటి ముందే పడిగాపులు కాచింది. ఆ సమయంలో మీడియాను ఉద్దేశిస్తూ సన్నీ కాస్త ఆగ్రహానికి లోనయ్యాడు.
చేతులు జోడించి మరీ సన్నీ డియోల్ మీడియాను తిట్టేశాడు. ఆప్ లోగోం కో షరమ్ అనే చాహియే.. ఆప్కో ఘర్ మే మా-బాప హై. అప్నే బచ్చే హై. షరమ్ నహీ ఆతీ అంటూ ఆయన ఫైర్ అయ్యాడు. మీకు సిగ్గుగా అనిపించడం లేదా, మీకూ తల్లితండ్రులు, పిల్లలు లేరా, సిగ్గుగా ఎందుకు లేదని సన్నీ అన్నారు. ధర్మేంద్ర గురించి న్యూస్ ను ప్రచురించే ఉద్దేశంతో కొన్ని రోజుల నుంచి ఫ్యామిలీ ఇంటి ముందే మీడియా ఎదురుచూస్తున్నది. దీంతో తీవ్ర ఫ్రస్టేషన్కు గురైన సన్నీ డియోల్ తనదైన స్టయిల్లో తన కోపాన్ని వ్యక్తం చేశాడు. ప్రైవసీ ఇవ్వాలంటూ కోరాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు