భారత్, ఆఫ్ఘాన్లతో యుద్ధానికి సిద్ధం.. పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు..
హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.) పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ఆయన మాట్లాడుతూ.. తూర్పు సరిహద్దులో భారత్తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘానిస్తాన్తో టూ-ఫ్రంట్ వార్కు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస
పాక్ రక్షణ మంత్రి


హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.) పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్

మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ఆయన మాట్లాడుతూ.. తూర్పు సరిహద్దులో భారత్తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘానిస్తాన్తో టూ-ఫ్రంట్ వార్కు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస్తాన్ రెండు దేశాలతో యుద్ధానికి “పూర్తిగా సిద్ధంగా ఉంది అని అన్నారు. ఢిల్లీ ఉగ్రవాద దాడి సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఒక బహిరంగ కార్యక్రమంలో ఆసిఫ్ మాట్లాడుతూ..మేము రెండు దేశాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. మాకు మొదటి రౌండ్ (ఆపరేషన్ సిందూర్) సమయంలో అల్లా మాకు సహాయం చేశాడు. రెండో రౌండ్లో కూడా ఆయన మాకు సాయం చేస్తాడని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande