అల్-ఫలాహ్ యూనివర్సిటీకి ఎదురుదెబ్బ.. న్యాక్ షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ, 13 నవంబర్ (హి.స.) ఢిల్లీ బాంబ్ పేలుడు నేపథ్యంలో ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్సిటీకి ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు ప్రచారంతో మోసగించినందుకు యూనివర్సిటీకి న్యాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాక్ గుర్తింపు లేకుండానే వైబ్సైట్లో మాత్రం కళా
అల్-ఫలాహ్ యూనివర్సిటీ


న్యూఢిల్లీ, 13 నవంబర్ (హి.స.)

ఢిల్లీ బాంబ్ పేలుడు నేపథ్యంలో ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్సిటీకి ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు ప్రచారంతో మోసగించినందుకు యూనివర్సిటీకి న్యాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాక్ గుర్తింపు లేకుండానే వైబ్సైట్లో మాత్రం కళాశాలకు గుర్తింపు ఉందంటూ బహిరంగంగా ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు గాను సమాధానం ఇవ్వాలంటూ న్యాక్ నోటీసులు పేర్కొంది.

తప్పుడు సమాచారంతో తల్లిదండ్రులు, విద్యార్థులను తప్పుదారి పట్టించడమే అవుతుందని తన నోటీసుల్లో న్యాక్ పేర్కొంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande