ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు లాంటివి: మంత్రి సీతక్క
ములుగు, 13 నవంబర్ (హి.స.) ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, ములుగు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద
మంత్రి సీతక్క


ములుగు, 13 నవంబర్ (హి.స.)

ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, ములుగు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నదని అన్నారు. గురువారం వెంకటాపూర్ మండలంలోని పాలంపేట రామప్ప సరస్సులో రూ.13 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన ద్వీపం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande