
హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)
మంత్రి కొండా సురేఖపై ప్రముఖ
యాక్టర్ అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై విచారణ వాయిదా పడింది. విచారణను ప్రజాప్రతినిధుల కోర్టు డిసెంబర్ 2కు వాయిదా వేసింది. నాగార్జున ఫ్యామిలీ పై మంచ సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ నాగార్జున కొండా సురేఖ పై పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ నడుస్తోంది. కాగా మంగళవారం అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ తన ఎక్స్ ఖాతా వేదికగా నాగార్జునకు క్షమాపణలు చెప్పడం గమనార్హం.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..