
విశాఖపట్నం, 13 నవంబర్ (హి.స.)
:భాగస్వామ్య సదస్సు కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఏమోయూభారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంటోంది. గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి లోకేష్ ప్రకటించినట్లు ఇంధన రంగంలో రీన్యూ పవర్ సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విశాఖలో ఏపీ ప్రభుత్వంతో రీన్యూ పవర్ ఈరోజు (గురువారం) ఒప్పందం చేసుకుంది. రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో రీన్యూ పవర్ సంస్థ ఎంఓయూలు కుదుర్చుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ