యువత డ్రగ్స్ ఊబిలో పడొద్దు..జనగామ డిసిపి
జనగామ, 13 నవంబర్ (హి.స.) జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గురువారం యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థుల్లో ర్యాగింగ్, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమ
జనగామ డిసిపి


జనగామ, 13 నవంబర్ (హి.స.)

జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో

గురువారం యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థుల్లో ర్యాగింగ్, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనగాం డీసీపీ రాజమహేంద్ర నాయక్, విద్యార్థులకు మార్గ దర్శకత్వం వహించారు.

విద్యార్థులు పరస్పర గౌరవం, క్రమశిక్షణ పాటించడంతో పాటు మత్తు పదార్థాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.ర్యాగింగ్ ఘటనలు గమనించినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయండి. యువత డ్రగ్స్ ఊబిలో పడకూడదు. ఎవరైనా మత్తు పదార్థాలు వాడినా లేదా విక్రయించినా కఠిన చర్యలు తప్పవు అని డీసీపీ హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చివరగా అందరూ ర్యాగింగ్, డ్రగ్స్కు నో చెప్పండి” అంటూ అవగాహన ప్రతిజ్ఞ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande