పత్తి కొనుగోళ్ల జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం..
నాగర్ కర్నూల్, 13 నవంబర్ (హి.స.) జిల్లాలో పత్తి కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదన్న అంశం పై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలకపల్లి మండలం చిన్న ముద్దునూరు గ్రామం వినాయక కాటన్ మిల్ వద్ద సీసీఐ పత్తి కొనుగో
నాగర్ కర్నూల్ కలెక్టర్


నాగర్ కర్నూల్, 13 నవంబర్ (హి.స.)

జిల్లాలో పత్తి కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదన్న అంశం పై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలకపల్లి మండలం చిన్న ముద్దునూరు గ్రామం వినాయక కాటన్ మిల్ వద్ద సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్నిఆయన గురువారం కలెక్టర్ పరిశీలించారు. పత్తి కొనుగోలు ప్రక్రియ, ట్యాబ్ ఎంట్రీ, గేట్ ఎంట్రీ పాస్, పంట నమోదు ప్రక్రియను స్లాట్ బుకింగ్ తదితర అంశాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande