ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలి.. నారాయణపేట జిల్లా కలెక్టర్
నారాయణపేట, 13 నవంబర్ (హి.స.) అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్ సూచించారు. గురువారం ఊట్కూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని ఆయా వ
నారాయణపేట కలెక్టర్


నారాయణపేట, 13 నవంబర్ (హి.స.) అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్ సూచించారు. గురువారం ఊట్కూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని ఆయా వార్డులు తిరిగి సమస్యల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటించడంతోపాటు రోగులకు వైద్య చికిత్సలు సకాలంలో అందించాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande