ఆంధ్రప్రదేశ్ లో.వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ అయిన 50 మంది మావోయిస్టులను పోలీసులు కోర్టులో.హాజరు పరిచారు
అమరావతి, 19 నవంబర్ (హి.స.) , :ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో అరెస్టయిన 50 మంది మావోయిస్టులను పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపర్చారు. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. వీ
ఆంధ్రప్రదేశ్ లో.వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ అయిన 50 మంది మావోయిస్టులను పోలీసులు  కోర్టులో.హాజరు పరిచారు


అమరావతి, 19 నవంబర్ (హి.స.)

, :ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో అరెస్టయిన 50 మంది మావోయిస్టులను పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపర్చారు. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులు మరణించారు. మరోవైపు అదే సమయంలో ఏలూరు, కాకినాడ, విజయవాడలలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా ఆయా నగరాల్లోని ఆ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి.. భారీగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande