
తిరుపతి, 20 నవంబర్ (హి.స.)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భద్రతా ఏర్పాటు కట్టుదిట్టం చేశారు. రేణిగుంట ఎయిర్‌పోర్టుకు రాష్ట్రపతి ముర్ము మద్యాహ్నం 3.25 గంటలకు చేరుకోనున్నారు. అనంతరం 3.55కు తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆమె తిరుమలకు చేరుకోనుండగా.. రాష్ట్రపతి ముర్ము కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
రేపు ఉదయం రాష్ట్రపతి దర్శన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటలకు శ్రీ వరాహస్వామి వారిని, 10 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. దర్శనానంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి నుంచి హైదరాబాదుకు బయలుదేరనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV