
మేడ్చల్ మల్కాజ్గిరి, 19 నవంబర్ (హి.స.)
సహజ కవి గాయకుడు అందెశ్రీకి మరణం లేదని, ఆయన మాటలు, పాటలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మల్కాజిరి జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ అవుషాపూర్ లో ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం అందెశ్రీ సంతాప సభనిర్వహించారు. ప్రముఖులు, కవులు, రచయితలు కళాకారులు, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ కోదండరాం, సినీ నటుడు నారాయణ మూర్తి, అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.... బడికి వెళ్ళక పోయినా.. గురువు లేకపోయినా.. పశువుల కాపరిగా ఉంటూ అందెశ్రీ సరస్వతి కటాక్షం పొందాడని అన్నారు. తన మాటల, పాటలతో పీడిత ప్రజలను చైతన్యం చేస్తూ జీవిత కాలమంతా గడిపిన గొప్ప వ్యక్తని కొనియాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు