
హుజురాబాద్, 19 నవంబర్ (హి.స.)
నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే అర్బన్ నక్సల్స్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత, గిరిజన, ఆదివాసీ అమాయకులను రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే వారి చావులకు కూడా బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదేపదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్ష, కార్యదర్శులు ఆపై స్థాయి నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు హుజురాబాద్కు వచ్చిన బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
అధికారంలో ఉన్నా లేకున్నా మావోయిజానికి బీజేపీ వ్యతిరేకం అని బండి సంజయ్ అన్నారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అసాధ్యమని ఈ విధానాన్ని ప్రజలు హర్షించబోరని తాము చెబుతూ వచ్చామని ఈ రోజు అదే నిజమైందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు