ఢిల్లీ వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టు విచారం..
న్యూఢిల్లీ, 19 నవంబర్ (హి.స.) ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తుండటంపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో తాజాగా గాలినాణ్యత 400 పాయింట్లకు పైగా నమోదయిం
సుప్రీం కోర్ట్


న్యూఢిల్లీ, 19 నవంబర్ (హి.స.)

ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ

క్షీణిస్తుండటంపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో తాజాగా గాలినాణ్యత 400 పాయింట్లకు పైగా నమోదయింది. చాందినీ చౌక్, DTU, ఆనంద్ విహార్, ముండ్క, నరేలా, వాజీపూర్ లలో గాలినాణ్యత తీవ్రంగా క్షీణించినట్లు తెలిపింది. ఈ క్రమంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్సీఆర్ పరిధిలోని పలు స్కూళ్లలో జరగాల్సి ఉన్న స్పోర్ట్స్, అథ్లెటిక్స్ పోటీలను వాయిదా వేసేలా ఆయా స్కూళ్లకు ఆదేశాలివ్వాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సూచనలు చేసింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande