మారేడుమిల్లి. ఏజెన్సీ లో.నిన్న ఈ రోజు.జరిగిన వరుస ఎన్కౌంటర్ల పై న్యాయ విచారణ జరపాలని.సిపిఎం డిమాండ్
విజయవాడ, 19 నవంబర్ (హి.స.) :అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో నిన్న, ఈరోజు జరిగిన వరుస ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ( డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులను ముందుగా
మారేడుమిల్లి. ఏజెన్సీ లో.నిన్న ఈ రోజు.జరిగిన వరుస ఎన్కౌంటర్ల పై న్యాయ విచారణ జరపాలని.సిపిఎం డిమాండ్


విజయవాడ, 19 నవంబర్ (హి.స.)

:అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో నిన్న, ఈరోజు జరిగిన వరుస ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ( డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి, అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు అన్యాయంగా బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని వార్తలు వచ్చాయన్నారు. చట్ట విరుద్ధమైన బూటకపు ఎన్‌కౌంటర్లను సీపీఎం ఖండిస్తుందని తెలిపారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి నగరాల్లో పోలీసులు దాడులు చేసి 50 మందికి పైగా మావోయిస్టులు, వారి అనుయాయులను నిర్బంధించారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande