
భద్రాద్రి కొత్తగూడెం, 19 నవంబర్ (హి.స.) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఫారెస్ట్ రేంజ్ బీట్ ఆఫీసర్ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలంలోని బయ్యారం అటవీ రేంజ్ లో బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న తులసిరామ్ అనే వ్యక్తి ఈ రోజు మృతి చెందారు... పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన అతను మండలంలోని బందగిరి నగరంలో బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఇటీవల ఇంటికి వెళ్లిన అతను పురుగుమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.9 కుటుంబ సభ్యులు గమనించి వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందాడు. తులసి రామ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు