
హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)
హైదరాబాద్ లో రెండో రోజు కూడా
ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, మెహ్ఫిల్, షా హౌస్ హోటళ్ల యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం నుండి పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించగా ఐటీ రిటర్న్స్ లో అవకతవకలు జరిగినట్టుగా గుర్తించారు. దీంతో రాజేంద్రనగర్ లోని పిస్తాహౌస్ ఓన్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషీ ఇళ్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. వర్కర్ల నుండి కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు సైతం ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్యాక్స్ చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఇదిలా ఉంటే ఈ హోటళ్లలో ఏటా వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బ్రాంచీలు ఉండటంతో పాటు విదేశాల్లోనూ ఈ హోటళ్ల బ్రాంచీలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..